బడ్జెట్ పై హరీష్ రావు ఫైర్..! 1 y ago
TG: బడ్జెట్ పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క అన్నీ అబద్దాలు చెప్పారని ఫైర్ అయ్యారు. మహిళా సంఘాలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారని ఆరోపించారు. కేవలం రూ.5 లక్షల రుణాలు మాత్రమే వడ్డీ లేకుండా ఇచ్చారని మిగతా ఋణాలకు 12 శాతం వడ్డీలు కడుతున్నారని తెలిపారు. రూ.4 వేలు ఇస్తామన్న పెన్షన్లు ఊసే లేదని, కొత్తగా ఎవ్వరికీ ఇవ్వలేదని, ఉన్నవే తొలగించారని విమర్శించారు.